BJYM అసెంబ్లీ ముట్టడి.. బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్ 1 y ago
TG: BJYM నాయకులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను వేలానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలసిందే. ఈ క్రమంలోనే యూనివర్సిటీ భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ తో.. మంగళవారం BJYM నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అయితే బీజేవైఎమ్ నేతలను, నిరసన కి మద్దతుగా నిలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.